అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైకులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వాయిదా పద్ధతుల్లో బ్యాటరీలతో నడిచే బైకులను ఇవ్వాలని ఇది వరకే నిర్ణయించిన విషయం తెలిసిందే. ముందస్తుగా ఎలాంటి డౌన్ పేమెంట్ లేకుండానే 24 నెలల నుంచి మొదలు 60 నెలల వరకు ఈఎంఐ వాయిదాలను ఎంచుకుని చెల్లించేలా వెసులుబాటు కల్పిస్తోంది. రాష్ట్రంలోని సచివాలయ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తింపచేయనున్నారు. దీని కోసం ఎన్‌టీపీసీ,ఈఈఎస్‌ఎల్ తదితర కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలతో కలిసి నెడ్‌క్యాప్ ఒక పథకాన్ని ఖరారు చేసినట్లు ఇంధన శాఖ తెలిపింది. ఎలక్రటిక్ బైకుల ధరలు వారు ఎంచుకునే బైకులోని బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా ఆయా సంస్థలు ఖరారు చేస్తున్నాయి.