క్వాలిటీ వైరింగ్​తోనే షార్ట్​ సర్క్యూట్​కు చెక్

  • ఎలక్ట్రికల్ లైసెన్సింగ్​ బోర్డ్​ మెంబర్స్ 

హైదరాబాద్​, వెలుగు: భవన నిర్మాణాల్లో నాణ్యమైన ​వైరింగ్​ను వినియోగించడమే విద్యుత్ ప్రమాదాల నివారణకు పరిష్కారమని ఎలక్ట్రికల్​ లైసెన్సింగ్ ​బోర్డు సభ్యులు తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్ లో క్వాలిటీ వైరింగ్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ ప్రోగామ్ లో ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డు మెంబర్ నేమాల బెనర్జీ, బోర్డు మాజీ సభ్యులు, ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్​అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క యాదగిరి, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, పాలీ క్యాబ్ ఇండియా లిమిటెడ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ సామ్యూల్ పాల్గొన్నారు.

 వారు మాట్లాడుతూ..నాణ్యతతో పాటు అధిక వేడిని తట్టుకొని ఎక్కువకాలం మన్నిక ఉండే వైరింగ్​ను వాడాలని సూచించారు. డొమెస్టిక్​ఇక్విప్​మెంట్లతో పాటు అగ్రికల్చర్​ మోటార్లకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైర్లు అమర్చాలని చెప్పారు. 105 డిగ్రీల ఉష్ట్రోగతతో కరెంట్​సరఫరా జరిగినా మెల్ట్​ కాకుండా తట్టుకునే వైరింగ్​ వాడితేనే షార్ట్ ర్క్యూట్ తో  అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చన్నారు.