
- అసెంబ్లీలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు
- సానుకూలంగా స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
కామారెడ్డి, వెలుగు : ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను ఏకో టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె.మదన్మోహన్రావు సోమవారం అసెంబ్లీలో మాట్లాడారు. నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు వద్ద ఏకో టూరిజంతో అభివృద్ధి చేయవచ్చన్నారు. రిజర్వాయర్‌కు సమీపంలో ని అభయారణ్యం, ఐలాండ్‌ను టూరిజం అభివృద్ధి చేయాలన్నారు. నాగిరెడ్డిపేట మండలంలో పురాతన త్రిలింగేశ్వర టెంపుల్ ఉందని, పక్కనే మంజీరా నది ప్రవహిస్తుందన్నారు.
లింగంపేటలో నాగన్నబావి, నియోజకవర్గంలో వీరన్నగుట్ట, రామారెడ్డి మండలంలో కాలభైరవ స్వామి టెంపుల్‌ను అభివృద్ధి చేయాలన్నారు. స్పందించిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పోచారం రిజర్వాయర్‌ను ఏకో టూరిజంగా, వాటర్ బేస్డ్ రిక్రియేషన్ కేంద్రంగా అభివృద్ధి చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. మెట్లబావిని కూడా అభివృద్ధి చేస్తామన్నారు.