ఎల్లారెడ్డిలో తీజ్​ వేడుకలు

ఎల్లారెడ్డిలో తీజ్​ వేడుకలు

ఎల్లారెడ్డి, వెలుగు: ఎల్లారెడ్డి పట్టణంలో ఆదివారం గిరిజనులు తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకల్లో గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలో ఆల్ ఇండియా బంజారా భవన్ నుంచి ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్  బస్టాండ్ మీదుగా గాంధీ చౌక్ వరకు పాటలు పాడుతూ, డీజే సౌండ్ తో నృత్యాలు చేస్తూ వెళ్లి చెరువులు, కుంటలు బావులలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కురుమ సాయిబాబా పాల్గొని గిరిజన మహిళలు, నాయకులతో స్టెప్పులు వేశారు.