బల్దియా కార్మికుల సమ్మె నోటీసు

బల్దియా కార్మికుల సమ్మె నోటీసు
  • కమిషనర్​కు నోటీసు ఇచ్చిన కార్మికులు

హైదరాబాద్, వెలుగు: బల్దియా కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న బయోమెట్రిక్ మెషీన్లపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని.. లేకపోతే  వచ్చే నెల 23 నుంచి సమ్మెకు దిగుతామని బీజేపీ మజ్దూర్ సెల్ సిటీ చైర్మన్, జీహెచ్ఎంఈ యూనియన్ ప్రెసిడెంట్ ఊదరి గోపాల్ అన్నారు. ఈ మేరకు గురువారం బల్దియా కమిషనర్ లోకేశ్ కుమార్ కు కార్మికులతో కలిసి ఆయన సమ్మె నోటీసు అందించారు. ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ.. బయోమెట్రిక్​ మెషీన్లు సరిగా పనిచేయకపోవడం వల్లే కార్మికులు నష్టపోతున్నారన్నారు. పనిచేసిన కూడా అటెండెన్స్​ పడకపోవడంతో జీతాలు తక్కువగా వస్తున్నాయన్నారు.   జూన్ 23లోగా కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామన్నారు.

 

 

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ ఆస్తులను వదిలేసి ప్రజలపై బల్దియా ప్రతాపం

బర్త్​కు బదులు డెత్​ తప్పులతడకగా సర్టిఫికెట్ల జారీ

అనుమతి లేకుండా స్లాటర్ హౌస్

బండ్లగూడ చెరువుకు గండి