సీబీసీ చర్చి అభివృద్ధికి కృషి చేస్తా : మంత్రి కొండా సురేఖ

సీబీసీ చర్చి అభివృద్ధికి కృషి చేస్తా : మంత్రి కొండా సురేఖ
  • దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ 

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్​ సిటీలోని క్రిస్టియన్​ కాలనీ సీబీసీ చర్చి అభివృద్ధికి కృషి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆదివారం సిటీలోని పుప్పాలగుట్ట మీద ఈస్టర్​ను వరంగల్​ క్రిస్టియన్​ కాలనీ సీబీసీ చర్చి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 

వేడుకల్లో పాల్గొన్నా మంత్రి మాట్లాడుతూ క్రైస్తవులకు ఈస్టర్​ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు వస్కుల బాబు, ప్రవీణ్, పాస్టర్లు, ప్రముఖ స్పీకర్​ బెంజమిన్ శాస్త్రి పలాధి, పుల్లా బాబుజగ్జీవన్​, కార్తీక్​ అబ్రహం, మాథ్యూస్, సంఘ పెద్దలు, క్రైస్తవులు హాజరయ్యారు.