వరల్డ్ కప్ లో పాకిస్థాన్ జట్టు నేడు(నవంబర్ 11) కీలక మ్యాచ్ ఆడబోతుంది. కోన ఊపిరితో ఉన్న సెమీస్ ఆశలతో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తో సమరానికి సిద్ధమైంది. కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై 287 పరుగుల భారీ తేడాతో గెలిస్తేనే 10 పాయింట్లతో ఉన్న న్యూజిలాండ్ ను వెనక్కి నెట్టి సెమీస్ కు వెళ్తుంది.
ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ కు మొదట బ్యాటింగ్ చేసే అవకాశం లేదు కాబట్టి టార్గెట్ ను 15 బతుల్లోనే ఛేజ్ చేయాలి. ఇది దాదాపు అసాధ్యం కనుక ఏ మూలనో ఉన్న పాక్ సెమీస్ ఆశలు ఆవిరయ్యాయి. మరోవైపు ఈ మెగా టోర్నీలో పేలవ ప్రదర్శన చేస్తున్న ఇంగ్లాండ్ జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాలి.
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI):
జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్, వికెట్ కీపర్), మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI):
అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, అఘా సల్మాన్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, హరీస్ రౌఫ్
#ENGvsPAK #CWC23
— News18 CricketNext (@cricketnext) November 11, 2023
England Win Toss and Opt to Bat First vs Pakistan
FOLLOW LIVE: https://t.co/dEmmYURtbO