
- రైల్వే స్టేషన్ ఎంట్రీ, ఎగ్జిట్ లో మార్పులు
హైదరాబాద్సిటీ, వెలుగు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులతో కొన్ని మార్పులు చేసినట్టు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ఆఫీసర్ఎ. శ్రీధర్ తెలిపారు. ప్లాట్‌ఫామ్–1కి వెళ్లాలంటే.. గేట్ –2(గణేశ్ఆలయం) వద్ద కొత్త ఎంట్రీ ఏర్పాటు చేశామని చెప్పారు. జనరల్ బుకింగ్ కౌంటర్, ఎంక్వైరీలో 750 మంది వేచి ఉండేందుకు 500 మంది సీటింగ్ సామర్థ్యంతో కొత్త వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
గేట్–4ను మూసేశామని, గేట్ –3, 3బీ (స్వాతి హోటల్ ఎదురుగా) వద్ద ఎక్స్ట్రా ఎంట్రీ ఏర్పాటు చేశామని వివరించారు. ప్లాట్‌ఫామ్ –10 లోని గేట్–8 (బోయిగూడ వైపు ప్రవేశ ద్వారం) వద్ద జనరల్ బుకింగ్ తో పాటు కొత్త ప్రవేశ ద్వారం ఏర్పాటు చేశామని వెల్లడించారు.