హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్ ఈప్యాక్ డ్యూరబుల్‌తో మరో ఎలక్ట్రానిక్స్ కంపెనీ హైసెన్స్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఏసీల తయారీ కోసం ఇది ఉపయోగపడుతుంది. మేకిన్ ఇండియా నినాదం ద్వారా స్థానిక ఉత్పత్తుల తయారీని పెంచడంతోపాటు ప్రీమియం-నాణ్యత గల గృహోపకరణాలను భారత మార్కెట్‌కు పరిచయం చేయడమే తమ లక్ష్యమని హైసెన్స్ తెలిపింది.
ప్రపంచస్థాయికి అనుగుణంగా వచ్చే 5 సంవత్సరాలలో భారతదేశంలో ఎయిర్ కండీషనర్, గృహోపకరణాల టాప్–5 బ్రాండ్లలో ఒకటిగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. ఈప్యాక్ డ్యూరబుల్ వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, గృహోపకరణాల తయారీకి పెట్టుబడి పెడుతుంది. ఆంధ్రాలోని శ్రీసిటీలో జూన్ 2025నాటికి ఫెసిలిటీ ప్రారంభమవుతుంది.