ఈపీఎఫ్​ఓ సేవలు ఇంకా ఈజీ

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్​ ప్రావిడెండ్​ ఫండ్​ ఆర్గనైజేషన్​(ఈపీఎఫ్​ఓ)లో సభ్యత్వం ఉన్న కొత్త ఉద్యోగులు ఇక నుంచి వ్యక్తిగత వివరాలను, ఈపీఎఫ్​ ట్రాన్స్​ఫర్​ను ఎంప్లాయర్స్​ వెరిఫికేషన్​ లేకుండా సొంతంగానే చేసుకోవచ్చు. దీనివల్ల 7.6 కోట్ల మంది సభ్యులకు మేలు జరుగుతుంది. ఈ కొత్త సదుపాయం శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈకేవైసీ ఈపీఎఫ్​ఖాతాల (ఆధార్ ​సీడెడ్) సభ్యులు ఈపీఎఫ్​ ట్రాన్స్​ఫర్​ క్లెయిమ్స్​ను ఆధార్​ఓటీపీతో పూర్తి చేయవచ్చు. 

ఈ సందర్భంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ మాట్లాడుతూ సంస్థలకు, వాటి ఉద్యోగులకు ఈ రెండు విధానాల వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. పేరు, పుట్టిన తేదీ, లింగం, జాతీయత, తల్లిదండ్రుల పేర్లు, డేట్​ ఆఫ్​ జాయినింగ్​, డేట్​ఆఫ్ ​లీవింగ్​వంటి వాటిలో మార్పులను కూడా ఉద్యోగులు సొంతంగా చేసుకోవచ్చని, ఎంప్లాయర్​ అప్రూవల్​ అవసరం లేదని వివరించారు.