అదానీపై కేసుతో.. మార్కెట్లు ఢమాల్

అదానీపై కేసుతో.. మార్కెట్లు ఢమాల్
  • ఇన్వెస్టర్లకు రూ. 5.27 లక్షల కోట్ల లాస్​

న్యూఢిల్లీ:  అదానీ గ్రూప్ స్టాక్స్ భారీగా క్షీణించడంతో గురువారం ఇన్వెస్టర్ల సంపద రూ.5.27 లక్షల కోట్లు క్షీణించింది. సెన్సెక్స్ 422.59 పాయింట్లు  తగ్గి 77,155.79 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది 775.65 పాయింట్లు  కోల్పోయి 76,802.73 వద్దకు చేరుకుంది. బీఎస్​ఈ లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 5,27,767.57 కోట్లు తగ్గి రూ. 4,25,38,908.01 కోట్లకు చేరుకుంది. అదానీ సంస్థల షేర్లన్నీ తీవ్రంగా నష్టపోయాయి. సెన్సెక్స్​లో పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ మాత్రమే లాభపడ్డాయి.

ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐలు మంగళవారం రూ. 3,411.73 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు. రష్యా–-ఉక్రెయిన్ వివాదం ముదరడం, ఎఫ్​ఐఐల అమ్మకాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రతికూలంగా ప్రభావితం చేశాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్  రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్  అన్నారు.  బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఇ స్మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్ గేజ్ 0.67 శాతం క్షీణించగా, మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.37 శాతం క్షీణించింది.  సెక్టోరల్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో   హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్, ఐటీ, రియల్టీ, టెక్ షేర్లు లాభపడ్డాయి.  ఆసియా మార్కెట్లలో, సియోల్, టోక్యో  హాంకాంగ్ నష్టాల్లో ముగియగా, షాంఘై లాభాలను ఆర్జించింది.  యూరప్ మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు చాలా వరకు పాజిటివ్ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముగిశాయి.