గుత్తికోయలకు పోలీసుల చేయూత

గుత్తికోయలకు పోలీసుల చేయూత

మంగపేట, వెలుగు: ములుగు జిల్లా మంగపేట మండలం అడవిలో నివాసం ఉంటున్న వలస గుత్తి కోయ గ్రామాలను ఆదివారం ఏటూరునాగరం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సందర్శించారు. ఈ సందర్భంగా సీజెఐ సాఫ్ట్ వేర్ కంపెనీకి చెందిన ఐటీ ఎంప్లాయీస్ రాబిన్ హుడ్, పోలీసులు సంయుక్తంగా వలస గుత్తి కోయ గ్రామాలైన ముసలమ్మ గుట్ట, ప్రాజెక్ట్ నగర్, శాంతినగర్, కేశవపురం, పాలాయగూడెం, రాళ్లగుంపు, ఎస్టీ కాలనీకి చెందిన 162 కుటుంబాలకు సోలార్ లైట్లు, నిత్యావసర వస్తువులు, దుస్తులు అందజేశారు. 

అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో అపరిచితులు, మావోయిస్టులకు ఆశ్రయం ఇవ్వకూడదని, మీకు ఎలాంటి సాయంకావాలన్నా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. కార్యక్రమంలో ఏటూరు నాగరం సీఐ  శ్రీనివాస్, మంగపేట ఎస్సై టీవీ ఆర్ సూరి, సాఫ్ట్ వేర్ కంపెనీ ఎంప్లాయీస్​ తదితరులు పాల్గొన్నారు.