
గద్వాల, వెలుగు: అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రసిద్ధి చెందిన హస్తకళలు, హ్యాండ్లూమ్, అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఎగ్జిబిషన్ బుధవారం ప్రారంభమైంది. కార్యక్రమాన్ని రాష్ర్టపతి ద్రౌపతి ముర్ము ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ లో తెలంగాణ నుంచి 40 స్టాల్స్ ఏర్పాటు చేశారు.
ఇందులో 25 స్టాల్స్ చేనేత రంగానికి చెందినవి ఉండగా, జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల చేనేత పట్టు చీరల స్టాల్స్ ఏర్పాటు చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు గ్రహీత అక్కల శాంతారాం ఆధ్వర్యంలో గద్వాల చేనేత జరీ చీరల ఉత్పత్తిదారుల సంఘం తరపున స్టాల్స్ నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 9 వరకు కొనసాగనుంది. సంఘం అధ్యక్షుడు అక్కల శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు మంత్రి సురేశ్ ఉన్నారు.