వనమా రాఘవేంద్రకు రిమాండ్‌ పొడిగింపు

భద్రాద్రి: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు కుమారుడు వనమా రాఘవేంద్రకు రిమాండ్‌ గడువును మరో 14 రోజులు పొడిగించారు. ఇవాళ్టితో రిమాండ్ గడువు ముగియడంతో జైలు అధికారులు రాఘవను వర్చువల్ గా  కోర్టులో హాజరుపరిచారు.  కొత్తగూడెం రెండో అదనపు జ్యుడీషియల్ కోర్టులో వాదనలు జరిగాయి.

ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఫిబ్రవరి 4 వరకు రిమాండ్‌ గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఉదంతంలో ప్రధాన సూత్రధారిగా వనమా రాఘవ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. నాగరామకృష్ణ సెల్ఫీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి. 

 

ఇవి కూడా చదవండి

ఒకే ఈవెంట్ లో6 పతకాలు సాధించిన హైదరాబాదీ

ఫేక్ ఛానళ్లు, వెబ్సైట్లపై యూట్యూబ్ కొరడా

IAS, IPS అధికారులకు పదోన్నతి