తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కల్పిస్తున్న దర్శనము, వసతి తదితర సేవలు దళారుల ప్రమేయం లేకుండా, మరింత పారదర్శకంగా నేరుగా అందించేందుకు టీటీడీ(TTD) చర్యలు చేపట్టింది . ఇందులో భాగంగా టీటీడీ భక్తులకు ఆఫ్‌లైన్(Offline) , ఆన్‌లైన్(Online) రెండింటిలోనూ అందించే సేవలను అనేక మంది మధ్యవర్తులు భక్తులను మోసం చేసి, భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ALSO READ | తొలి ఏకాదశి ఎప్పుడు.. ఆరోజు ఏంచేయాలి.. ఏంచేయకూడదు..
తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన టికెట్లను ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో భక్తులకు పారదర్శకంగా కేటాయించే విధంగా చర్యలకు దిగుతోంది.. అందులో భాగంగా దళారులకు చెక్ పెట్టేందుకు సిద్దమయ్యంది.. అయితే, ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో దళారులు బల్క్ బుకింగ్ ... పెద్ద ఎత్తున దర్శన టికెట్లతో పాటు వసతి గదులు పొందినట్లు గుర్తించింది టీటీడీ.. దీంతో.. బల్క్ బుకింగ్ కింద పొందిన టికెట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.. అలాంటి వారి పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు టీటీడీ అధికారులు.. ఫేస్ రికగ్నిషన్ (ఫేషియల్ రికగ్నిషన్) విధానంలో భక్తులు టికెట్లు పొందేలా మార్పులు చేసేందుకు రెడీ అవుతున్నారు.. అంతేకాదు.. ఆధార్ అనుసంధానానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తోందట టీటీడీ.. అంటే.. టీటీడీ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే.. మొత్తం దళారి వ్యవస్థకే పులిస్టాప్ పెట్టేలా ఉంటుంది.
ALSO READ | తొలి ఏకాదశి విశిష్టత.. ఈ వ్రతం చేస్తే శివకేశవులతోపాటు అమ్మ అనుగ్రహం
గత ఏడాది కాలంగా ఆన్‌లైన్ లో (రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం, డిప్, వసతి, ఆర్జిత సేవాలు, వర్చువల్ సేవలు మొదలైనవి) , ఆఫ్‌లైన్ లో (ఎస్ ఎస్ డి టోకెన్లు, వసతి) తదితర సేవల బుకింగ్‌లపై ఇటీవల టీటీడీ జరిపిన విచారణలో ఇందులో ఓకే మొబైల్ నంబర్, మెయిల్ ఐడీలు ఉపయోగించి మధ్యవర్తులు బల్క్ బుకింగ్ (Bulk booking) పొందినట్లు విచారణలో గుర్తించారు.
ఒకే మొబైల్ నంబర్‌తో 110 గదులు
తిరుమలలో కరెంట్ బుకింగ్‌లో ఒకే మొబైల్ నంబర్‌తో 110 గదులు పొందినట్లు , ఆన్‌లైన్ బుకింగ్‌లో ఒకే మొబైల్ నంబర్‌ను ఉపయోగించి 807 వసతి బుకింగ్‌లు, ఆన్‌లైన్ ఒకే ఇమెయిల్ ఐడిని ఉపయోగించి 926 వసతి బుకింగ్‌లు చేసినట్లు గుర్తించిన అధికారులు వాటిపై చర్యలకు ఉపక్రమించారు. అదేవిధంగా ఒకే మొబైల్ నంబర్‌ని ఉపయోగించి ఒక సంవత్సరంలో 1,279 డిప్ రిజిస్ట్రేషన్‌లు,ఒకే మెయిల్ ఐడీని ఉపయోగించి ఒక సంవత్సరంలో 48 డిప్ రిజిస్ట్రేషన్‌లు,ఒకే ఐడి ప్రూఫ్‌ని ఉపయోగించి 14 ఎస్ ఎస్ డి సర్వ సర్వదర్శనం టోకెన్లు పొందారని అధికారులు తెలిపారు.
ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్..
నిజమైన యాత్రికులు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (Facial recognition System)ను ఉపయోగించి మధ్యవర్తి లేకుండా సేవను నేరుగా పొందేలా టీటీడీ కార్యాచరణ రూపొందిస్తుందని అధికారులు తెలిపారు. దళారులు ఫేక్ మొబైల్, మెయిల్ ఐడి ప్రూఫ్‌లను ఉపయోగించి చేసిన బుకింగ్‌లపై కఠినమైన ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. సరైన ధృవీకరణ కోసం ఆధార్ సేవలను ఉపయోగించేలా కూడా టీటీడీ ప్రయత్నాలు చేపడుతోందని వెల్లడించారు.