అక్కడ భారీగా పడిపోయిన పుష్ప 2 కలెక్షన్స్.. ఆ స్టార్ హీరోనే కారణమా..?

అక్కడ భారీగా పడిపోయిన పుష్ప 2 కలెక్షన్స్.. ఆ స్టార్ హీరోనే కారణమా..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2: ది రూల్ సినిమా డిసెంబర్ 05న గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే అయితే పుష్ప 2 రిలీజ్ అయిన రోజు నుంచి అన్ని చోట్ల మంచి ఓపెనింగ్స్ సాధించి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో 12 రోజుల్లోనే దాదాపుగా రూ.1297 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది. అలాగే కేవలం 10 రోజుల్లోనే రూ.1000 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసిన సినిమా తొలి ఇండియన్ సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో పుష్ప రాజ్ కి వరల్డ్ వైడ్ గా మంచి ప్రశంసలు అందుతున్నాయి.

అయితే  మలయాళంలో మాత్రం ఆశించిన స్థాయిలో పుష్ప 2 కలెక్షన్లు రాబట్టలేకపోతోంది.  కాగా శనివారం వరల్డ్ వైడ్ దాదాపుగా రూ.100 కోట్లు (గ్రాస్) కలెక్షన్లు సాధించింది. కానీ ఇందులో మలయాళం షేర్ కేవలం రూ.40 లక్షలు మాత్రమే ఉంది. ఇందుకు కారణం పుష్ప 2 సినిమాలోని ఫహద్ ఫాజిల్ పాత్ర అని కొందరు నెటిజన్లు అంటున్నారు. 

Also Read : పెళ్లి తర్వాత మొదటి సినిమాను అనౌన్స్ చేసిన లావణ్య త్రిపాఠి

ఫహద్ ఫాజిల్ పుష్ప 2 లో భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఫహద్ పాత్ర నెగిటివ్ షేడ్స్ కలిగి ఉన్నప్పటికీ పెద్దగా ఎలివేషన్స్ లేకపోవడం, అలాగే కొన్ని సీన్స్ లో ఓవర్ గా హీరోయిజం చూపించడంతో ఫహద్ ఫాజిల్ పాత్రని మలయాళ ఆడియన్స్ పెద్దగా యాక్సెప్ట్ చేయలేకపోయారు. 

దీంతో పుష్ప 2 సినిమా కేరళ ఆడియన్స్ కి పెద్దగా ఎక్కలేదని చెప్పవచ్చు. అయితే ఇప్పటివరకూ నార్త్ లో దాదాపుగా రూ.507 కోట్లు (నెట్), తమిళ్ లో రూ.62 కోట్లు, తెలుగులో రూ.262 కోట్లు (షేర్) కలెక్షన్స్ సాధించగా కేరళలో కేవలం రూ.13 కోట్లు (నెట్) రాబట్టింది. నార్త్ తరవాత కేరళ నుంచి మంచి కలెక్షన్లు వస్తాయని మేకర్స్ భావించగా కొంతమేర నిరాశ ఎదురైందని చెప్పవచ్చ.