ఎయిర్ పోర్టుల్లో హైటెక్ బెగ్గింగ్...ఈ బిచ్చగాడు యమ రిచ్..

ఎయిర్ పోర్టుల్లో హైటెక్ బెగ్గింగ్...ఈ బిచ్చగాడు యమ రిచ్..

 రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లు, గుడిమెట్ల మీద.. ట్రాఫిక్ కూడళ్ల దగ్గర  భిక్షాటన చేసుకునేవాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. కొన్నిసార్లు అయితే.. నడుస్తున్న ట్రైన్లు, బస్సుల్లో కూడా బిచ్చమెత్తడం గమనిస్తుంటాం. అయితే, ఓ యువకుడు మాత్రం దీనికి ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా ఎయిర్పోర్టులోనే భిక్షాటన చేయడం మొదలుపెట్టాడు. ప్రయాణికుల వద్ద డబ్బులు అడుక్కుంటుండగా గమనించిన విమానాశ్రయ సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు ఈ మేరకు తెలియజేశారు..

ఈజీ మనీ కోసం అడ్డదారులు..

ఈజీ మనీకోసం ప్రజలు అడ్డదారులు ఎతుక్కుంటారు.  డబ్బు సంపాదించేందుకు పలు రకాల మార్గాలున్నాయి. కాని కష్టపడకుండా మనీ సంపాదించేందుకు కొంతమంది అడ్డదారులు ఎతుక్కుంటారు.  జనాలకు మాయ మాటలు చెప్పి.. వారి దగ్గరి నుంచి ఎంతో కొంత గుంజి ఎంజాయి చేస్తుంటారు.  పర్సు పోయిందనో... మా వారికి ఆరోగ్యం బాగా లేదనో.. మా అమ్మాయి పెళ్లికి ధనం కావాలనో ఇలా జనాల దగ్గర బాధల్లో ఉన్నట్లు నటిస్తారు.  వాళ్ల  బ్రెయిన్‌ ఉపయోగించి ఐడియాలు వాడి ఎదుటి వారి నుంచి డబ్బులు తీసుకుని జల్సాలకు పాల్పడుతుంటారు. వారికి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో తెలియదు కానీ.. ఇలాంటి ఐడియాలు కొంత కాలమే పనిచేస్తాయని మాత్రం మర్చిపోతుంటారు.

బెగ్గింగ్‌ ప్లాన్‌.. రోజుకు 50 నుంచి 60 వేలు

తాజాగా ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి  వ్యక్తి కష్టపడకుండా ఈజీగా మనీ సంపాదించేదుకు ప్లాన్‌ వేశాడు. ఆప్లాన్‌ వర్కంట్‌ అవడంతో దాన్నే ఫాలో అయ్యాడు. అతను వేసిన ప్లాన్‌ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. అదే బెగ్గింగ్‌ ప్లాన్‌ (అడుక్కోవడం). అదికూడ గుడి, ఫంక్షన్‌ హాల్లు దగ్గర కాదండోయ్..  ఏకంగా ఎయిర్‌ పోర్టులోనే అడుక్కోవడం స్టార్ట్‌ చేశాడు. ఒక్కరోజుకు రూ. 50 నుంచి 60 వేల వరకు సంపాదించి జల్సాలకు పాల్పడే వాడు. ఇదే శాస్వతం అనుకున్నాడు. కానీ ఆ జల్సాలే అతన్ని పోలీసులకు పట్టుబడేలా చేశాయి. 

సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం

చెన్నైకు చెందిన విఘ్నేష్ బీటెక్ పూర్తి చేసి కొన్నాళ్లు బెంగళూరులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. అప్పట్లో అతనికి నాలుగంకెల జీతం కూడా వచ్చేది. ఓసారి బెంగళూరు నుంచి చెన్నై రావడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని విమానాశ్రయానికి వస్తుండగా విఘ్నేష్ పర్సు పోగొట్టుకున్నారు. విమాన టికెట్ తన ఫోన్లోనే ఉన్నప్పటికీ చెన్నైలో దిగాక ఇంటికి వెళ్లేందుకు రూపాయి కూడా లేని పరిస్థితిని బెంగళూరు విమానాశ్రయం లాంజ్లో ఓ విదేశీయుడితో తన పర్సు పోయిన విషయాన్ని పంచుకున్నాడు. అతనిపై జాలిపడ్డ విదేశీయుడు రూ. 10 వేలు ఇచ్చాడు. ఆ తర్వాత కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగం కోల్పోవడంతో రోడ్డునపడ్డ విఘ్నేష్.. బెంగళూరు ఎయిర్ పోర్టు అనుభవంతో ఈజీ మనీపై దృష్టి పెట్టాడు.

ఒంటరి ప్రయాణికులే టార్గెట్..

 తక్కువ ధరకు వచ్చేలా డొమెస్టిక్‌ విమాన టికెట్లు బుక్‌ చేసుకొని, ఖరీదైన క్యాజువల్స్‌ ధరించి, చేతిలో లగేజ్‌ బ్యాగ్‌ తో ఎవరికి అనుమానం రాకుండా ప్లైట్ షెడ్యూల్‌ టైం కు ముందే ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించేవాడు. ఒంటరిగా ప్రయాణిస్తున్న ప్యాసింజర్‌ను ఎంచుకుని మాటలు కలిపేవాడు. ఆపై ఫోన్‌ సైలెంట్‌ మోడ్‌ లో ఉంచి బాధల్లో వున్నట్లు మాట్లాడినట్లు నటించేవాడు. దీంతో అతన్నే గమనిస్తున్న ప్యాసింజర్‌ జాలిపడి వీలైనంత సొమ్ము ఇచ్చేవాడు. ఇలా విఘ్నేష్‌ ఒక్కోరోజు రూ. 50 వేల నుంచి రూ. 60 వేలకు వరకు సంపాదించేవాడు. ఇలా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ సహా ఎనిమిది నగరాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో తన జేబు నింపుకునేవాడు. చెన్నైలోని తన ఇంటికి వెళ్లి జల్సా చేసేవాడు. 

విదేశీ ప్రయాణికులకు కట్టుకథలు

విఘ్నేష్‌ మోసంచేసిన వారిలో ఎక్కవ మంది విదేశీయులే కావడం గమనార్హం. ఎందుకంటే వీరికి ఇది మోసమని తెలిసే అవకాశం కూడా తక్కువ కాబట్టి విదేశీయులనే టార్గెట్ గా బెగ్గర్‌ దందా చేసేవాడు. దీంతో 2021 నుంచి విఘ్నేష్‌ దందా కొనసాగింది. అయితే విఘ్నేష్‌ పై ఇప్పటి వరకు ఎవరు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో విఘ్నేష్‌ ఇంకా రెచ్చిపోయి 2023 వరకు బెగ్గర్‌ దందా కొనసాగిస్తూనే ఉన్నాడు. కాగా ఈనెల మే 11న బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్టులో ఇద్దరికి టోకరా వేసి మూడో వ్యక్తి దగ్గరకు విఘ్నేష్‌ వెళ్లడాన్ని గమనించిన ఓ సీఐఎస్‌ఎఫ్‌ అధికారి అతనిపై అనుమానం వచ్చి అతన్నే ఫాల్లో అయ్యాడు. విఘ్నేష్‌ చేస్తున్నది బెగ్గర్‌ దందాగా గుర్తించి అదుపులోకి తీకుని ప్రశ్నించగా నిర్ఘాంతపోయే నిజాలు వెలుగులోకి రావడంతో షాక్‌ తిన్నారు అధికారులు. విఘ్నేష్‌ ను అరెస్ట్‌ చేసి పోలీసులకు అప్పగించారు.