మేడ్చల్ జిల్లా ఓ రైతు అర్ధరాత్రి వ్యవసాయ పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలోని కీసర గ్రామంలో పొలంలో ఓ వ్యక్తి అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు బీబీనగర్ మండలం అన్నంపట్ల గ్రామానికి చెందిన పర్వతం మహేష్ గా పోలీసులు గుర్తించారు.
మృతికి గల కారణాలు ఆరా తీస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కీసర పోలీసులు.