రాజన్న సిరిసిల్ల జిల్లా: చందుర్తి మండలం సింగిల్ విండో కార్యాలయం ఎదుట ఓ రైతు తనదైన శైలిలో నిరసన తెలిపాడు. అతడు మార్కెట్ కు తెచ్చిన వడ్ల బస్తాలను తూకం వేసి.. 15రోజులైనా అక్కడి నుంచి తరలించలేదు.. ఎక్కడివి అక్కడే ఉంచారు. ధాన్యం డబ్బులు కూడా ఇంకా చెల్లించలేదు. దీన్ని చూసి చలించిన చందుర్తి మండలానికి చెందిన రైతు మల్లేశం ఇవాళ వడ్ల బస్తాలను సింగిల్ విండో కార్యాలయం ఎదుట పడేసి నిరసన తెలిపారు.
వెంటనే ధాన్యాన్ని తరలించి..డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ధాన్యం బస్తాలు తూకం వేసినందుకు ఒక్కో బస్తాకు రెండు రూపాయలు చొప్పున అదనంగా చెల్లించమన్నారని మల్లేశం వాపోయారు. మరీ ఇంత నత్తనడకన కొనుగోళ్లు జరిపితే ఎలా ? అని అడిగినా తనను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్త ం చేశాడు.