
ఆర్మూర్, వెలుగు : వ్యాపారులు సిండికేట్గా మారి పసుపు ధరను తగ్గిస్తున్నారని అఖిల భారత ఐక్య రైతు సంఘం రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి దేవరాం ఆరోపించారు. సోమవారం ఆర్మూర్ లో మీడియాతో వారు మాట్లాడారు. వ్యాపారుల సంఘం రైతులకు నష్టం తీసుకొచ్చేలా తీర్మానం చేసిందని గతంలోనే కలెక్టర్ కు ఫిర్యాదు చేశామన్నారు.
వందలాది మంది రైతులు బస్టాండ్ వద్ద రాస్తారోకో చేసినా పాలకులకు కనువిప్పు కలగడం లేదన్నారు. సాంగ్లీ మార్కెట్కు, నిజామాబాద్ మార్కెట్కు క్వింటాలుకు రూ.4,000 నుంచి 5000 తేడా ఉందన్నారు. క్వింటాలు పసుపునకు రూ.15,000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో జిల్లా నాయకుడు బి. కిషన్ పాల్గొన్నారు.