రూపాయికే కిలో ఉల్లి అమ్మి నిరసన తెలిపిన రైతులు

తమిళనాడు కోయంబత్తూర్ కలక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు ఉల్లి రైతులు. ఒక రూపాయికే కిలో చిన్న ఉల్లిని అమ్మి నిరసన తెలిపారు రైతులు. చిన్న ఉల్లిని కిలో 20 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని.. దీంతో పెట్టుబడి కూడా అందట్లేదని వాపోయారు రైతులు. రీజనబుల్ రేట్లకు ఉల్లిని కొనుగోలు చేసేలా చూడాలని కోయంబత్తూర్ కలెక్టర్ కు వినతి అందజేశారు. మెడలో చిన్న ఉల్లి దండలు వేసుకుని నిరసన తెలిపారు.