
- భీంగల్-నిజామాబాద్ మెయిన్ రోడ్‌పై బైఠాయింపు
నిజామాబాద్, వెలుగు : జిల్లాలోని భీంగల్ మండలం గోనుగొప్పుల విలేజ్‌లోని ఐకేపీ, సింగిల్ విండో వడ్ల కొనుగోలు సెంటర్లలో తరుగు ఎక్కువగా వస్తుందని రైతులు ఆందోళన చేశారు. ప్రతి 40 కిలోల బస్తాకు 300 గ్రాముల తరుగు తీస్తూ నష్టం చేస్తున్నారని భీంగల్ నిజామాబాద్ మెయిన్ రోడ్‌పై బైఠాయించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ షబ్బీర్ రైతుల వద్దకు చేరుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. తహసీల్దార్ వెంట ఎస్సై మహేశ్ ఉన్నారు.
కోటగిరిలో రైతుల ధర్నా
కోటగిరి, వెలుగు: ఎలాంటి తరుగు లేకుండా ధ్యానం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం రైతులు ధర్నాకు దిగారు . 40 కిలోల బస్తాకు 500 నుండి 650 గ్రాముల వరకు తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో ఏముల నవీన్, మామిడి శ్రీనివాస్, కర్నె గజేందర్, పాకాల సాయిలు, ఎడ్డెడి పోశెట్టి, మామిడి సాయిప్రసాద్, కాశీరామ్, తేల్ల శ్యామ్ సుందర్, ఎల్లుట్ల గజేందర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.