లింగంపేట తహసీల్దార్ ఆఫీస్ ఖాళీ..ఆందోళనకు దిగిన రైతులు

లింగంపేట తహసీల్దార్ ఆఫీస్ ఖాళీ..ఆందోళనకు దిగిన రైతులు
  • పనుల నిర్వహణలో జాప్యం
  • సర్వర్​ డౌన్​ అంటూ సాకులు
  • చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ను వేడుకుంటున్న అన్నదాతలు 

లింగంపేట, వెలుగు : లింగంపేట తహసీల్దార్, సిబ్బంది తీరును నిరసిస్తూ బుధవారం పలువురు రైతులు తహసీల్దార్​ ఆఫీస్​ ఎదుట ఆందోళనకు దిగారు. భూముల రిజిస్ట్రేషన్​ల కోసం  మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతు లు తహసీల్దార్ ఆఫీస్​కు చేరుకున్నారు. కార్యాలయ సిబ్బంది సర్వర్ డౌన్​ ఉన్నందున వేచి ఉండాలని సూచించారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ​ తహసీల్దార్​సురేష్​, డిప్యూటీ తహసీల్దార్ రాందాస్ తో పాటు సిబ్బంది బయటకు వెళ్లారు. తహసీల్దార్​కు ఫోన్​ చేస్తే స్పందించలేదు.  తహసీల్దార్​ తో పాటు సిబ్బంది ఎల్లారెడ్డిలో జరిగిన ఓ ఫంక్షన్​కు  వెళ్లినట్లు రైతులు ఆరోపించారు. 

సర్వన్​డౌన్​ పేరిట  రెవెన్యూ ఆఫీసర్లు ,సిబ్బంది ఆఫీస్​ను వదిలి వెళ్లడం ఏమిటని రైతులు ప్రశ్నించారు.  రెవెన్యూ సిబ్బంది ఆఫీస్​ వదిలి వెళ్లడం లింగంపేట మండల చరిత్రలో ఇదే మెదటిసారి అని రైతునాయకులు సిద్దారెడ్డి, ప్రతాప్​రెడ్డి ఆరోపించారు. సాయంత్రం4.30 గంటల తర్వాత తహసీల్దార్​ ఆఫీస్​కు చేరుకున్నారని  చెప్పారు. పది మంది రైతులకు చెందిన రిజిస్ట్రేషన్లు ఉండగా  కేవలం రెండు రిజిస్ట్రేషన్లు చేసి తహసీల్దార్​ వెళ్లిపోయా డని వారు ఆరోపించారు. విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తహసీల్దార్, సిబ్బందిపై   కలెక్టర్​ తగు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్​ చేశారు.