- ఎన్హెచ్ఏఐ ఆఫీస్ ఎదుట రైతుల ధర్నా
మహబూబ్నగర్, వెలుగు: భారత్ మాల రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు రెండేండ్లుగా నష్టపరిహారం చెల్లించడం లేదని బాధిత రైతులు ఆందోళనకు దిగారు. పట్టణంలోని ఎన్హెచ్ఏఐ ఆఫీస్ ఎదుట నారాయణపేట జిల్లా మక్తల్ మండలానికి చెందిన 19 గ్రామాల రైతులు ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారత్ మాల రోడ్డు నిర్మాణంలో ఇండ్లు కోల్పోయిన వారికి మెరుగైన నష్టపరిహారం అందించాలన్నారు. నెల రోజుల్లో పరిహారం ఇప్పిస్తామని సంబంధిత అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అనంతరం పీడీకి వినితిపత్రం అందించారు.