నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆదివారం రైతులు ఆందోళనకు దిగారు. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ కోదాడ, నల్గొండ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మిర్యాలగూడ పరిసర ప్రాంతంతోని రైస్ మిల్లుల ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. రైస్ మిల్లర్స్ సిండికేట్ గా ఏర్పడి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వడ్ల లోడ్లతో వచ్చిన ట్రాక్టర్లతో రోడ్డు నిండిపోయాయి. రైతుల ధర్నా కారణంగా రహదారులపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. -మద్దతు ధర కల్పించి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అన్నదాతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.