సీతారామ ప్రాజెక్ట్  లింక్​ కెనాల్​ ద్వారా నీరు అందించాలి : రైతులు

సీతారామ ప్రాజెక్ట్  లింక్​ కెనాల్​ ద్వారా నీరు అందించాలి : రైతులు

జూలూరుపాడు, వెలుగు: మండల పరిధిలోని వీరభద్రపురం గ్రామ సమీపంలోని సీతారామ ప్రాజెక్ట్ వద్ద మండలానికి లింక్​ కెనాల్​ ద్వారా చెరువులకు నీరు అందించాలని ఆదివారం రైతులు నిరసన చేపట్టారు. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో సీతారామ ప్రాజెక్ట్​ ద్వారా నీరు అందిస్తామని హామీ ఇచ్చినా  ఇప్పటి వరకు పనులు పూర్తికాలేదని రైతులు అన్నారు.

ఈ ప్రాజెక్ట్​ వలన వేలాది ఎకరాల భూములను  రైతులు కోల్పోయారని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నీటి వసతి లేని మండలం జూలూరుపాడు మండలం కాబట్టి సీతారామ ప్రాజెక్ట్​ ను యుద్ధప్రాదికన పనులు పూర్తి చేసి, లింక్​ కెనాల్​ ద్వారా చెరువులకు నీటిని అందించి రైతులను ఆదుకోవలన్నారు.ఈ కార్యక్రమంలో మండలంలోని గుండెపుడి, వినోభనగర్, రామచంద్రపురం, అనంతారం గ్రామాల రైతులు పాల్గొన్నారు.