పశువులకు ఆహారం అందించడం రైతులకు సవాలుగా మారుతోంది. ఈ క్రమంలో పశుగ్రాసాన్ని సాగు చేయడం ద్వారా రైతులు అధిక ఆదాయాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒకే పొలంలో కొన్ని రకాల పంటలను పండిస్తే ఏడాది అంతా పశుగ్రాసం ఉంటుంది. జొన్న, మొక్కజొన్న, మినుము, జామ పండిస్తే పశు మేత కొరత ఉండదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. రైతులు ఈ పశుగ్రాసాలను ఒకే పొలంలో ఎలా పండించాలి.. వాటి వలన కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
పశుపోషణ కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంప్రదాయ పంటలను సాగుచేయకపోవడంతో పశుగ్రాసం కొరత వేధిస్తోంది. పాలు ఇవ్వడానికి, వ్యవసాయం చేయడానికి పశువులకు మేలైన పశుగ్రాసం అందించాలి. రైతులు ఎక్కువగా వాణిజ్య పంటలే సాగుచేస్తుండడంతో మేత లేక మూగజీవాలు అల్లాడుతున్నాయి. వరిపంట ద్వారా లభించిన వరిగడ్డి మాత్రమే పశువులకు ఆధారమైంది. అది కూడా సరిపడా లేకపోవడంతో రైతులు పశుగ్రాసం కోసం వేలాదిరూపాయలు వెచ్చించి సుదూర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో పశువుల రైతులు ఒకే పొలంలో జొన్న, మొక్కజొన్న, మినుము, జామ వంటి వాటిని సాగు చేయడం ద్వారా పచ్చి మేత కొరత నివారించవచ్చు. ఈ పంటల మేత అన్ని జంతువులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రైతులు తమ పొలాల్లో ఈ మేతను 2:1 నిష్పత్తిలో విత్తుకోవాలి. ఈ పంటల ద్వారా వచ్చిన పచ్చి మేతలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. రైతులు ఈ పచ్చి మేతను ఏ సీజన్ లో అయినా సాగు చేసుకోవచ్చు, ఈ పచ్చి మేత మంచి దిగుబడి వస్తుంది.
హెక్టారుకు20 నుంచి 25 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. డ్రిల్ పద్దతిలో విత్తనాలను 20 నుంచి 25 సెంటీమీటర్ల వరుసలో విత్తుకుంటే ఎక్కువ మేత సాగు అవుతుంది. పశుగ్రాసం విత్తే ముందు హెక్టారుకు 50 కిలోల నత్రజని, 30 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ పొలంలో వేయాలి. విత్తిన ఒక నెల తర్వాత 30 కిలోల నత్రజనిని నిలబడి ఉన్న పంటలో వరుసల మధ్య చల్లాలి. నీటిపారుదల తక్కువగా ఉన్న ప్రాంతాల్లో విత్తిన 30 నుంచి 35 రోజుల తర్వాత వర్షం కురిసినప్పుడు హెక్టారుకు 20 నుంచి 30 కిలోల నత్రజనిని వేయాలి.
పచ్చి మేత వల్ల కలిగే ప్రయోజనాలు
- 1. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు , ఖనిజ లవణాలు వంటి పోషకాలు పచ్చి మేతలో పుష్కలంగా ఉంటాయి
- 2. ఈ ఆహారంలో ( పశుగ్రాసం) ప్రోటీన్లు ఉండటం వలన పశువులను అనేక రకాల వ్యాధుల రక్షించవచ్చు.
- 3. పచ్చి మేతతో కెరోటిన్ పుష్కలంగా ఉండటం వల్ల విటమిన్ ఎ అధికంగా జంతువుల శరీరానికి అంది.. అంధత్వం నుంచి కాపాడవచ్చు.
- 4. జంతువులకు పచ్చి మేత తినిపించడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది.
- 5. పచ్చిమేత జంతువుల్లో జీర్ణశక్తి పెంచుతుంది. ఈ ఆహారం చాలా రుచికరంగా ఉంటుంది.
- 6. పచ్చి మేత తినిపించడం ద్వారా జంతువుల చర్మం మృదువుగా నునుపుగా మారుతుంది.
- 7. పచ్చి మేత తినిపించడం వల్ల పాలు పితికే జంతువులలో పాల పరిమాణం పెరుగుతుంది.
- 8. పచ్చి మేతను తినిపించడం ద్వారా జంతువుల్లో సమయానికి గర్భం దాల్చే సామర్థ్యం పెరుగుతుంది.