పెనుబల్లి, వెలుగు: కొడుకులు లేని తండ్రికి కూతురే అన్నీ తానై తలకొరివి పెట్టింది. ఈ సంఘటన పెనుబల్లి మండలంలో ఆదివారం జరిగింది. వేంసూరు గ్రామానికి చెందిన బింగి నారాయణ(95)కు ఇద్దరు కూతుళ్లు. గతేడాది తన భార్య చనిపోవడంతో పెనుబల్లిలో తన పెద్ద కూతురు బండి వెంకట నరసమ్మ వద్ద ఉంటున్నాడు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం ఉదయం చనిపోయాడు. నరసమ్మ కర్మకాండలు నిర్వహించింది. తన భార్య చనిపోయినపుడు చిన్న కూతురు సత్యవతి తలకొరివి పెట్టగా ఇప్పుడు పెద్ద కూతురు తండ్రికి తల కొరివి పెట్టి వారు తల్లిదండ్రుల రుణం తీర్చుకున్నారు.