పెద్ద సైకో గాడు : శవాలు దొంగతనం.. అస్థిపంజరాలుగా మార్చి.. సహజీవనం

ఎవరైనా బంగారమో.. వెండో...  దొంగిలిస్తారు. ఇంకా బైక్ దొంగలు.. గొలుసు దొంగలు.. ఇలా చోరీ స్టోరీస్ చాలా రకాలుగా వార్తలు వస్తున్నాయి.  ఇవన్నీ సాధారణమే.. కాని ఇప్పుడు ఓ దేశంలో ఏకంగా ఓ వ్యక్తి  చనిపోయిన వారిని దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.  అతని ఇంటిని సోదా చేసిన పోలీసులకు విచిత్రమైన సమాధానం ఇచ్చాడు.  

సాధారణంగా చనిపోయిన వారికి సంబంధించిన వస్తువులను ఎవరికైనా ఇవ్వడమో... బయటపడయడమో చేస్తాము.  ఇక ఎముకలు, అస్థికలు.. వారి వారి సంప్రదాయాల ప్రకారం పుణ్య నదుల్లో కలుపుతారు.  మెడికల్ కాలేజీల్లో అయితే చనిపోయిన వారిని ప్రాక్టికల్స్ కోసం ఉపయోగిస్తారు. ఇంకా చిన్న చిన్న స్కూళ్లల్లో ఒకటో..రెండో అస్థి పంజరాలను ఉంచి పిల్లలకు పాఠాలు చెబుతారు.  కాని ఓ ప్రబుద్దుడు ఏకంగా 40 అస్థి పంజరాలను ఇంట్లోనే ఉంచుకొని.. ఎంచక్కా కుటుంబసభ్యుల మాదిరిగా వాటితోనే జీవిస్తున్న ఘటన అమెరికాలో వెలుగు చూసింది.  

హార్వార్డ్ మెడికల్ స్కూల్ లో కొన్ని మృతదేహాలమృతదేహాల అవశేషాలు దొంగిలించబడుతున్నాయని ఎఫ్.బి.ఐకి ఫిర్యాదు చేశారు సదరు స్కూలు సిబ్బంది  .  అప్పటి నుండి కేసు దర్యాప్తు చేసున్న ఎఫ్.బి.ఐ అధికారులకు కెంటక్కీకి చెందిన జేమ్స్ నాట్(39) పై అనుమానం వచ్చింది. పోలీసులు అతడి తలుపు తట్టి లోపల ఎవరున్నారని అడగగా నేను చనిపోయిన నా స్నేహితులు ఉన్నారని విచిత్రమైన సమాధానమిచ్చాడట. 

ఇంకేముంది పోలీసులు దౌర్జన్యంగా ఇంటిలోకి  వెళ్లి చూడగా.. ఎక్కడ చూసినా ఆస్తిపంజరాలు, పుర్రెలే. ఫర్నీచర్ చుట్టూ మానవ అవశేషాలను చక్కగా అలంకరించుకున్నాడట జేమ్స్. ఒక హార్వార్డ్ స్కూలుకు సంబంధించిన బ్యాగ్ కూడా అక్కడ దొరకడంతో తాము వెతుకుతున్న నేరస్తులలో జేమ్స్ ఉండి ఉంటాడని అనుమానంతో దర్యాప్తు చేశారు అధికారులు. పోలీసులు అతనిని అదుపులోకి లోతుగా విచారణ మొదలు పెట్టారు.  

జేమ్స్ నాట్ ఇంటిని సోదా చేయగా  మొత్తం 40 పుర్రెలు, వెన్నుపూసలు దొరికాయి. అతడి పేస్ బుక్ మెసేజులన్నీ పరిశీలించగా అతడు జెరెమి పాలీ అనే వ్యక్తితో మానవ అవశేషాల కొనుగోలుకు సంబంధించి లావాదేవీలు నడుపుతున్న విషయం బయటపడింది. ఇంటిలో కొన్ని మారణాయుధాలు కూడా దొరకడంతో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడని..  నిషేధిత వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నాడన్న నేరం కింద జేమ్స్ నాట్ ని అరెస్టు చేశారు. జెరెమి పాలీ కోసం గాలిస్తున్నారు. 

జెరెమి పాలీ, జేమ్స్ నాట్ వీరంతా మానవ అవశేషాలను విక్రయించే ముఠాకు చెందిన వారిని.. వీరు శరీరంలోని ఎముకల తోపాటు చర్మాన్ని కూడా అమ్ముకుంటారని తెలిపారు ఎఫ్.బి.ఐ అధికారులు.