
ముషీరాబాద్, వెలుగు: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) ఆధ్వర్యంలో శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఇంటర్ డివిజినల్ కల్చరల్ ఫెస్ట్–2025 ఆకట్టుకుంది. 7 జిల్లాల ఉద్యోగులు, కేంద్ర కార్యాలయం సిబ్బంది హాజరయ్యారు. నాటికలు, ఏకపాత్రాభినయాలు, నృత్యాలు, ఆటలతో అలరించారు. డీజీఎం ఎస్.కె. చౌదరి మాట్లాడుతూ.. ఉద్యోగుల్లో మానసికోల్లాసం, చైతన్యం కలిగించడానికి ఈ ఫెస్ట్ ఎంతగానో దోహదం చేస్తుందన్నారు.
అధికారులతో మాట్లాడే విధానం, ఉద్యోగులు ప్రవర్తించే తీరుపై ప్రదర్శించిన నాటిక ఎంతగానో ఆకట్టుకుంది. నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతున్న నాటిక కంటతడి పెట్టించింది. రీజినల్ మేనేజర్ మృత్యుంజయ కుమార్, ఏజీఎంలు గజానంద్, నీరజన్ కుమార్, డాక్టర్ రాజన్, రామ్ తదితరులు పాల్గొన్నారు.