![క్యాన్సర్ తో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మృతి](https://static.v6velugu.com/uploads/2024/03/femina-miss-india-tripura-2017-rinky-chakma-tragically-passed-away-after-a-valiant-battle-with-breast-cancer_4wdI6JjS7u.jpg)
క్యాన్సర్ తో మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్ త్రిపుర రింకీ చక్మా(28) కన్నుమూశారు.గత రెండేళ్గుగా బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె చికిత్స పొందుతూ ఫిబ్రవరి 29న మరణించారు. రింకీ మృతిపట్ల ఆమె అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు.
త్రిపురకు చెందిన రింకీ చక్మా 2017 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనలిస్టుగా నిలిచారు. ఇదే ఫైనల్లో మానుషీ చిల్లర్ మిస్ ఇండియాగా కిరీటాన్ని గెలుచుకున్నారు. కొన్ని రోజుల క్రితం తనకు క్యాన్సర్ సోకిందని చికిత్సకు డబ్బుల్లేవని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన ఫ్రెండ్స్ ఫండ్స్ సేకరించారు. కానీ కొన్ని రోజులకే ఆమె ఆరోగ్యం తిరగబెట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు..