
హాలియా, వెలుగు : బ్యాంకు ఖాతాదారుల ఫిక్సుడ్ డిపాజిట్లను అక్రమంగా డ్రా చేసిన బ్యాంకు ఉద్యోగిని విజయపురి టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను నాగార్జునసాగర్ సర్కిల్ సీఐ బీసన్న, ఎస్సై సంపత్ తెలిపారు. తిరుమలగిరి సాగర్ మండలం జానారెడ్డి కాలనీకి చెందిన గిరీశ్..నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని ఏపీజీవీ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్. ఖాతాదారులు జమ చేసిన రూ.6.57 లక్షలను అక్రమంగా డ్రా చేసి బెట్టింగ్‌కు పాల్పడ్డాడు. అధికారుల ఫిర్యాదుతో పోలీసులు గిరీశ్‌ను అదుపులోకి తీసుకొని విచారించడంతో నేరం ఒప్పుకున్నాడు. రూ.6.57 లక్షలతో పాటు మరో రూ.40 లక్షల వరకు అప్పులు చేసి ఆన్లైన్ బెట్టింగ్ పెట్టి పోగొట్టుకున్నానని అంగీకరించాడు. దీంతో గిరీశ్‌ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.