హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగింది. పాత బస్తీలోని మదీనా బల్డింగ్ లో ఉన్న జాకీ గార్మెంట్స్ షోరూమ్ లో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో షోరూమ్ లో ఉన్న బట్టలన్నీ కాలిబూడిదైయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు రంగలోకి దిగారు. భారీ మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించడంతో పక్కన ఉన్న షాపుల వారంతా ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. భారీగా పొగ వ్యాపించడంతో ఊపిరిఆడక జనాలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.