ఖమ్మం పత్తి మార్కెట్లో అగ్ని ప్రమాదం

  • 800 బస్తాల పత్తి దగ్ధం, రూ.25 లక్షల నష్టం
  • ప్రమాదం జరిగిన తీరుపై అనుమానాలు
  • విచారణ చేయాలని మంత్రి తుమ్మల ఆదేశం

ఖమ్మం/ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం అగ్రిమార్కెట్‌‌‌‌లో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగి రూ. 25 లక్షల విలువైన 800 బస్తాల పత్తి తగులబడింది. వివరాల్లోకి వెళ్తే... రజిత కాటన్‌‌‌‌ ట్రేడర్స్‌‌‌‌ యజమాని రామ శ్రీను, మణికంఠ కాటన్‌‌‌‌ ట్రేడర్స్‌‌‌‌ ఓనర్‌‌‌‌ పాండుకు చెందిన 1500 బస్తాల పత్తిని మార్కెట్‌‌‌‌లోని షెడ్‌‌‌‌లో నిల్వచేశారు. ఎక్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ ఆర్డర్స్‌‌‌‌ లేకపోవడం, మార్కెట్‌‌‌‌కు ఐదు రోజులు సెలవులు కావడంతో బస్తాలు మార్కెట్‌‌‌‌లోనే ఉన్నాయి. బుధవారం సాయంత్రం పత్తి బస్తాలకు నిప్పంటుకుంది. గమనించిన పలువురు వెంటనే ఫైర్‌‌‌‌ స్టేషన్‌‌‌‌కు సమాచారం ఇచ్చారు.

 ఫైర్‌‌‌‌ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి కారణం.. ఎవరైనా సిగరెట్‌‌‌‌ కాల్చి పడేశారా ? షార్ట్‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌ జరిగిందా ? లేక మరేదైనా కారణముందా ? అనేది తెలియడం లేదు. ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రమాదం ఎలా జరిగింది, ఇందుకు కారణాలు ఏమిటో ఎంక్వైరీ చేయాలని పోలీస్‌‌‌‌ కమిషనర్‌‌‌‌తో పాటు ఆఫీసర్లను ఆదేశించారు. సెలవు రోజుల్లో ఈ సంఘటన జరగటంపై పూర్తిగా వివరాలు సేకరించి రిపోర్ట్‌‌‌‌ ఇవ్వాలని సూచించారు.