![Ganesh Chaturthi: లాల్‌బాగ్చా రాజా ఫస్ట్ లుక్ ఇదిగో](https://static.v6velugu.com/uploads/2023/09/First-Look-Of-Mumbai's-Lalbaugcha-Raja's-Ganpati-Idol_G6Cbpy2u0A.jpg)
ముంబయిలో అంగరంగ వైభవంగా నిర్వహించే పండుగల్లో వినాయక చవితి ఒకటి. ఈ ఉత్సవాల్లో భాగంగా అక్కడ లాల్‌బాగ్చా రాజా సార్వజనిక గణేశోత్సవ్ నిర్వహించే వేడుకల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి సంవత్సరం, లాల్‌బాగ్చా రాజా వద్ద గణేశుడిని చూసేందుకు వేలాది మంది భక్తులు గుమిగూడుతారు.
మరో రెండురోజుల్లో గణేష్ చతుర్థి పండుగ ఉండగా 2023 సెప్టెంబర్ 15 శుక్రవారం లాల్‌బాగ్చా రాజా ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం ముంబైలో ఆవిష్కరించారు. ఈ సంవత్సరం, లాల్‌బౌచ రాజా విగ్రహం ఛత్రపతి శివాజీ మహారాజ్ సింహాసనం మాదిరిగానే అలంకరించబడిన సింహాసనంలో కనిపిస్తుంది.
ALSO READ: వినాయక చవితి స్పెషల్ : దునియా మొత్తం పోచంపల్లి చీరలంటే ఫిదా
లాల్‌బాగ్చా రాజా ఈ సంవత్సరం 12 అడుగుల పొడవు ఉంటుందని చెబుతున్నారు. సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు లాల్‌బాగ్చా రాజా. ప్రస్తుతం లాల్‌బాగ్చా రాజా గణేషుడి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.