ఆదిలాబాద్లో ఫుడ్ పాయిజన్తో 15 మందికి అస్వస్థత

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మెండపెల్లి గ్రామంలో కలుషిత ఆహారం తిని 15 మందికి అస్వస్థతకు గురయ్యారు. ముండెం బలిరాం ఇంట్లో పితృమాసం సందర్భంగా ఏర్పాటు చేసిన భోజనం తిన్న 15 మందికి ఫుడ్ పాయిజన్ అయింది.  దీంతో వారిని ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. 

అస్వస్థతకు గురైన వారిలో కొందరిని జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు, మరికొందరిని మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి అంబులెన్స్‌ల్లో తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారికి గ్రామంలో శిబిరం ఏర్పాటు చేసి వైద్యులు సేవలందిస్తున్నారు.