ఎస్సీ హాస్టల్​లో ఫుడ్​ పాయిజన్.. అస్వస్థతకు గురైన పలువురు విద్యార్థులు

ఎస్సీ హాస్టల్​లో ఫుడ్​ పాయిజన్.. అస్వస్థతకు గురైన పలువురు విద్యార్థులు
  • హాస్టల్​ను విజిట్​ చేసి ఆరా తీసిన డీఎంహెచ్​వో రాజశ్రీ 

వర్ని, వెలుగు : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కోటయ్య క్యాంప్ లోని ఎస్సీ హాస్టల్​లో​ ఫుడ్​ పాయిజన్ కావడం వల్ల  విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి..  ఎస్సీ హాస్టల్ లో  సుమారు 84 మంది విద్యార్థులు ఎస్ఎన్ పురంలోని జిల్లా పరిషత్ ( గల్స్) హైస్కూల్ లో చదువుకుంటూ కోటయ్య క్యాంప్ లోని ఎస్సీ హాస్టల్ లో ఉంటున్నారు.  మంగళవారం పదో తరగతి విద్యార్థుల ఫేర్ వెల్ పార్టీలో  బిర్యాని తిని కొందరు అస్వస్థత కు గురయ్యారు.  బుధవారం మరో ఇద్దరు విద్యార్థులకు కడుపు నొప్పి రావడం తో హాస్టల్ సిబ్బంది వర్ని లోని సీహెచ్ సీ హాస్పిటల్ కి తరలించారు. 

మళ్లీ 23 మంది కడుపు నొప్పి వస్తుందనడంతో చికిత్సలు చేసి ఎలాంటి అపాయం లేదని వైద్యులు తెలుపడంతో ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న డీఎంహెచ్​వో రాజశ్రీ, రుద్రూర్ మెడికల్ ఆఫీసర్ అయేషా సిద్ధీక్, పీహెచ్ఎస్​వో కృష్ణవేణి, సూపర్ వైజర్ లు జ్యోతి, రవి అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. హాస్టల్ పరిసరాలను పరిశీలించి శుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్​వో రాజశ్రీ హాస్టల్​ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.