నాగారం గురుకులంలో ఫుడ్ పాయిజన్

నాగారం గురుకులంలో ఫుడ్ పాయిజన్
  • 33 మంది స్టూడెంట్లకు అస్వస్థత

కీసర, వెలుగు: మేడ్చల్​జిల్లా కీసర మండలం నాగారం మైనార్టీ గురుకులంలోని స్టూడెంట్లకు ఫుడ్ పాయిజనింగ్​జరిగింది. 33 మంది అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం టిఫిన్ తిన్నాక.. స్టూడెంట్లు  కడుపు నొప్పితోపాటు వాంతులు చేసుకున్నారు. సిబ్బంది వెంటనే వారిని చికిత్స కోసం ఘట్ కేసర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సాయంత్రానికి 15 మందిని డాక్టర్లు డిశ్చార్జ్ ​చేశారు.

 మిగిలిన వారికి చికిత్స కొనసాగుతోంది. అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, గురువారం ఉదయం బ్రేక్​ఫాస్ట్ గా పెట్టిన బొండాలు తిన్న కొందరికి డైజెస్ట్ ​కాకపోవడంతో అస్వస్థతకు గురయ్యారని డాక్టర్లు తెలిపారు. కాగా, నాగారం గురుకులంలో మొత్తం 450 మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారు.