- హేమాంక్షి బేకరీ ఫ్యాక్టరీలో గుర్తింపు
షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మేకగూడలో హేమాంక్షి బేకరీ ఫ్యాక్టరీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదివారం దాడులు చేశారు. దాదాపు రూ.14 లక్షల విలువ చేసే కాలం చెల్లిన ముడి సరుకులను సీజ్ చేసి, యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అపరిశుభ్ర వాతావరణంలో కాలచెల్లిన ముడి సరుకులతో బేకరీ ఐటెమ్స్ తయారు చేసి దేశ, విదేశాలకు సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. లేబుల్ లేని కోకోపౌడర్ ( 875 కిలోలు), లిక్విడ్ జీఎంఎస్(165 కిలోలు), మాల్టో డెక్స్టిన్, కేక్ జల్ (170 కిలోలు), మిల్క్ పౌడర్ (375 కేజీలు), స్టార్చ్(625 కిలోలు) గడువు ముగిసినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.