శరత్​ సిటీ మాల్​రెస్టారెంట్లలో ఫుడ్​ సేఫ్టీఆఫీసర్ల తనిఖీలు

శరత్​ సిటీ మాల్​రెస్టారెంట్లలో ఫుడ్​ సేఫ్టీఆఫీసర్ల తనిఖీలు

గచ్చిబౌలి, వెలుగు : హైదరాబాద్ కొండాపూర్​లోని​శరత్ ​సిటీ మాల్​లోని రెస్టారెంట్లలో ఫుడ్​సేఫ్టీ టాస్క్​ఫోర్స్​ అధికారులు  తనిఖీలు చేశారు. చట్నీస్​ రెస్టారెంట్​, అల్పాహార్​ టిఫిన్స్‌‌లో సోదాలు నిర్వహించారు. చట్నీస్​ రెస్టారెంట్​లోని ఫుడ్ స్టొరేజీ​ ఏరియాల్లో, కిచెన్​లో బొద్దింకలను గుర్తించారు. పురుగులు పట్టిన గోధుమ పిండి, రవ్వను, కుళ్లిపోయిన ఉల్లిగడ్డలు, క్యాబేజీని వంటల్లో వాడుతున్నట్లు నిర్ధారించారు.  

అదే విధంగా అల్పాహార్​ టిఫిన్స్​లో డస్ట్​ బిన్లు ఓపెన్​ చేసి ఉండడం, వంట పాత్రలపై మూతలు పెట్టడం లేదని గుర్తించారు. ఫుడ్​పై మూతలు లేకుండానే ఫ్రిజ్​లో స్టోర్​ చేసినట్లు నిర్ధారించారు. అయితే, రెస్టారెంట్లపై తీసుకున్న చర్యల గురించి అధికారులు వెల్లడించలేదు.