వన్య ప్రాణులకు వాటర్ సోర్స్ పై స్పెషల్​ఫోకస్

వన్య ప్రాణులకు వాటర్ సోర్స్ పై స్పెషల్​ఫోకస్

వేసవిలో వన్య ప్రాణులకు నీటిని అందుబాటులో ఉంచేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో ఆఫీసర్లు స్పెషల్​ ఫోకస్​పెట్టారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కనకగిరి అడవి ప్రాంతం పులిగుండాలతో పాటు నీలాద్రి అడవి ప్రాంతంలో వన్య ప్రాణులకు నీటి కొరత ఏర్పడి అడవి నుంచి బయటకు వచ్చి వేటగాళ్ల ఉచ్చులో పడుతున్నాయి.

దీన్ని నివారించేందుకు అటవీ శాఖ అధికారులు అడవిలో సోలార్ పంపు సెట్లను ఏర్పాటు చేసి నిత్యం నీరుపారెలా చూస్తున్నారు. పంపుసెట్లు లేని చోట  ప్రత్యేక తొట్లు ఏర్పాటు చేసి వాటిని రోజూ నీటితో నింపుతున్నారు. పులిగుండాల ప్రాజెక్ట్ సమీపంలో ఏర్పాటు చేసిన నీటి కొలను వద్ద జింకలు, రాబందులు నీరు తాగుతూ సీసీ కెమెరాకు చిక్కాయి. – పెనుబల్లి, వెలుగు