జూలూరుపాడు, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు అటవీ రేంజ్, తల్లాడ అటవీ రేంజ్ సరిహద్దు లోని మూన్యాతండా, భద్రుతండా గ్రామ పంటపొలాల్లో చిరుతపులి సంచరించినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
గ్రామస్తులు ఇచ్చిన సమాచారం తో సోమవారం పారెస్ట్ అధికారులు పరిశీలించి అవి చిరుతపులి పాదముద్రలే అని గుర్తించారు. పరిసర గ్రామ ప్రజలను అప్రమత్తంచేసి ,రాత్రి సమయాల్లో ప్రజలు, రైతులు ఎవరూ ఒంటరిగా బయటకు రావద్దని, చిరుత పులి జాడ కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు ఎఫ్ఆర్ఓ ప్రసాదరావు, సిబ్బంది పాల్గొన్నారు.