భార్యాబిడ్డలతో సహా మాజీ కార్పొరేటర్​ సూసైడ్

  • మధ్యప్రదేశ్​లోని విదిశ జిల్లాలో ఘటన 

భోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: బీజేపీ మాజీ కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని విదిశ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మాజీ కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిశ్రా(45), ఆయన భార్య నీలం(42), కొడుకులు అన్మోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(13), సార్థక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(7) విదిశ టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నివాసం ఉంటున్నారు. కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొడుకులు అన్మోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సార్థక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చిన్నప్పటి నుంచి అరుదైన జెనటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాధితో బాధపడుతున్నారు. వారిని డాక్టర్లకు చూపించగా, ఇది అరుదైన మస్క్యూలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిస్ట్రోఫీ(కండరాల బలహీనత) అని చెప్పారు. ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయించినా వ్యాధి తగ్గలేదు. చిన్నప్పటి నుంచి పిల్లల బాధను చూడలేక తల్లిదండ్రులు తీవ్ర మనోవేదన అనుభవించారు.

ఈ క్రమంలో సంజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిశ్రా గురువారం ఓ ట్వీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ‘‘శత్రువుల పిల్లలకు కూడా ఆ దేవుడు ఇలాంటి వ్యాధి ఇవ్వకూడదు. నా పిల్లలను రక్షించుకోలేకపోతున్నా. ఇక, నాకు బతకాలని లేదు” అని ట్వీట్​ చేశారు. ఇది చూసిన సంజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంధువులు వెంటనే ఆయన ఇంటికి వెళ్లగా, లోపలి నుంచి తలుపు గడియవేసి ఉంది. పోలీసుల సాయంతో తలుపులు బద్దలుకొట్టి, లోపలికి వెళ్లగా నలుగురు అపస్మారక స్థితిలో కనిపించారు. వారిని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే, మిశ్రా తన ఇద్దరి పిల్లలను చంపేసి, తర్వాత భార్యాతో కలిసి ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.