
హైదరాబాద్, వెలుగు: మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మంగళవారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తమ నియోజకవర్గమైన ఇల్లందుకు సీతారామ ప్రాజెక్టు నీరు అందించే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన సీఎంకు వినతి పత్రం ఇచ్చారు. ఇంతకుముందు సీఎం రేవంత్ ను ఆయన ఇంటివద్ద కలిసేందుకు గుమ్మడి నర్సయ్య ప్రయత్నించారు. అయితే సీఎం కలవకపోవడంతో దీన్ని సోషల్ మీడి యాలో తీవ్ర వివాదాస్పదం చేశారు. ఈ నేపథ్యంలో సీఎంను గుమ్మడి నర్సయ్య కలవడం ప్రాధాన్యత సంత రించుకుంది.
ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీలో గుమ్మడి నర్సయ్య మీడియాతో మాట్లాడుతూ.. గత సంఘటనను సీఎం తన వద్ద ప్రస్తావించలేదని, తాను కూడా ఆ విషయాన్ని గుర్తు చేయలేదని, తన నియోజకవర్గానికి నీరందితే చాలని ఆయన స్పష్టం చేశారు.