నేను అవినీతి పరుడినని కేసీఆర్ తో చెప్పించు : కోనేరు కోనప్ప

నేను అవినీతి పరుడినని కేసీఆర్ తో చెప్పించు : కోనేరు కోనప్ప
  • నీ పుట్టిన ఊర్లో నీకు డిపాజిట్ రాలే
  • ఆర్​ఎస్ ప్రవీణ్ కుమార్ పై మండిపడ్డ కోనేరు కోనప్ప
  • బీఆర్​ఎస్​లో చేరడంలేదని వెల్లడి

కాగజ్ నగర్, వెలుగు: ఎక్కడి నుంచో వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజకవర్గంలో నీచ రాజకీయాలు చేస్తూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మండిపడ్డారు. తాను అవినీతి పరుడినని అంటున్న ప్రవీణ్ కుమార్.. కేసీఆర్, కేటీఆర్ తో చెప్పించాలని సవాల్ విసిరారు. సోమవారం కాగజ్ నగర్ లోని ఓ ఫంక్షన్ హాల్​లో ప్రెస్ మీట్ నిర్వహించి తనపై ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్ కుమార్ పై ఫైర్ అయ్యారు. 

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్, కేటీఆర్​ను ఇష్టమొచ్చినట్లు​తిడుతూ ఆరోపణలు చేసిన ప్రవీణ్ కుమార్ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే బీఎస్పీకి గుడ్ బై చెప్పి ఆ పార్టీలోనే చేరారని అన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉంచి రెండే రోజుల్లో ఇంకో పార్టీలో చేరడం ఆయనకే చెల్లిందని ఎద్దేవా చేశారు. సిర్పూర్​లో ప్రజలు ఓడిస్తే, ఇక్కడ నుంచి మళ్లీ పుట్టిన ఊరు నాగర్​ కర్నూల్​కు వెళ్లి పోటీ చేస్తే అక్కడి ప్రజలు కూడా చిత్తుగా ఓడించి తరిమి కొట్టారని అన్నారు. తాను బీఆర్ఎస్​లో చేరుతున్నట్లు ప్రవీణ్ కుమార్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. నియోజకవర్గానికి టూరిస్ట్ లాగ నెలకోసారి వచ్చి అడ్డగోలుగా మాట్లా డితే సహించేది లేదని హెచ్చరించారు.