హైదరాబాద్, వెలుగు: గల్లీ మే గాళీ.. ఢిల్లీ మే డోలి అన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రగతి, ప్రతిష్ట తిరోగమనంలో పయనిస్తోందని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. గతంలో హైదరాబాద్ అంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అనే పేరు ఉండేదని, కానీ కాంగ్రెస్ వచ్చాక 6 మోసాలు.. 66 అబద్ధాలు అన్నట్టుగా పరిస్థితి మారిందని తెలిపారు. గల్లీలో తిట్లు.. ఢిల్లీలో మెట్లు.. దేవుళ్లపై ఒట్లు పెట్టడం వరకే సర్కార్ పరిమితమైందని ఎద్దేవా చేశారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మాట్లాడారు.
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మొదలు ఇప్పటి వరకు ఏడాదిలో 24 సార్లు ఢిల్లీకి వెళ్లి రికార్డు సృష్టించారని చెప్పారు. ప్రధాని మోదీ హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మారుస్తారని తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ముమ్మాటికీ అధికారం బీజేపీదేనని స్పష్టం చేశారు. బీజేపీకి ఫైర్ లేదని కొందరు అంటున్నారని, త్వరలో వైల్డ్ ఫైర్ చూస్తారన్నారు. తగ్గేదెలే.. అన్నట్టుగా కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు.