పాల్వంచ, వెలుగు : పాల్వంచలోని కేటీపీఎస్ ఏ కాలనీ తెలంగాణ మాల విద్యుత్ ఉద్యోగుల సంఘ కార్యాలయం ప్రాంగణంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, మాజీ కేంద్ర మంత్రి దివంగత గడ్డం వెంకటస్వామి విగ్రహాల ఏర్పాటుకు శుక్రవారం భూమి పూజ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేటీపీ ఎస్ కాంప్లెక్స్ చీఫ్ ఇంజినీర్లు పలుకుర్తి వెంకటేశ్వరరావు, మేక ప్రభాకర్ రావు, కె శ్రీనివాసబాబు విచ్చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతి నేతలను గౌరవించుకోవడం తమ బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో కేటీపీఎస్ ఎస్ఈలు ఎం.శ్రీనివాసరావు, యుగపతి, మోక్షవీర్, గుర్రం రాజకుమార్, డీఈ రాందాస్, వెల్ఫేర్ ఆఫీసర్ బి.శ్రీనివాసరావు, డీఈ అనిల్ కు మార్, జాతీయ మాల విద్యుత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బూర్గుల విజయభాస్కరరావు, నల్లబెల్లి రాంబాబు, సంపత్, వినయ్ రాజ్, జాకోబ్ పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.