
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో నాలుగెకరాల మామిడి తోట దగ్ధం అయ్యింది. ఎండ వేడి తోటలోని ట్రాన్స్ఫర్ వద్ద మంటలతో కింద ఉన్న ఆకులు అంటుకుని తోట మొత్తం కాలిపోయింది.
మామిడి చెట్లన్నీ కాలిపోయాయి. దాదాపురూ. 5 లక్షల వరకు అస్తినష్టం ఏర్పడింది.కాయలున్న తోట కావడంతో నోటికాడ కూడు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు బాధితురాలు నర్సమ్మ. తమను ప్రభుత్వం అదుకోవాలని .. నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధితురాలు వేడుకుంది.