- చత్తీస్గఢ్లో ఘటన
చత్తీస్‌గఢ్: స్టీల్ ప్లాంట్లోని చిమ్నీ కూలిపోవడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 25 మంది కార్మికులు ఆ చిమ్నీ కింద చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. అందులో కొందరు మృత్యువాత పడి ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం ముంగేలి జిల్లా సరాగావ్లోని ఇనుప పైపులు తయారు చేసే ప్లాంట్లో గురువారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.
భారీ యంత్రాలతో చిమ్నీని లేపేందుకు, కార్మికులను రెస్క్యూ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. గాయాలతో బయటపడిన ఇద్దరిని బిలాస్పూర్లోని ఆస్పత్రికి తరలించారు. బల్క్ మెటీరియల్ను నిల్వ చేయడానికి రూపొందించిన ఇనుప చిమ్నీ అకస్మాత్తుగా కూలిపోయిందని అధికారులు తెలిపారు. సైట్లో పనిచేస్తున్న కార్మికులు దానికింద చిక్కుకుపోవడంతో రెస్క్యూ టీమ్స్, పోలీసులు వాళ్లను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.