
కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఓబీసీ విద్యార్థులకు ‘ స్కీం ఫర్ ఫ్రీ కోచింగ్ ఫర్ ఎస్సీ అండ్ ఓబీసీ స్టూడెంట్స్’ పేరుతో కాంపిటీటివ్, అకడమిక్ కోచింగ్‌లకు అవసరమైన ఆర్థికసాయం అందిస్తోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
సీట్ల సంఖ్య: 1500
అర్హత: కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న ఎస్సీ, ఓబీసీ విద్యార్థులు. అభ్యర్థి రాసే పరీక్షకు సంబంధించి ఇంటర్, డిగ్రీ, బీటెక్ లో కనీస మార్కులు సాధించాలి.
ఫ్రీ కోచింగ్ ఉన్న ఎగ్జామ్స్: యూపీఎస్సీ నిర్వహించే గ్రూప్ ఏ, బీ ఉద్యోగాలు, ఎస్ఎస్బీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ చేపట్టే నియామకాలు. రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే ఎగ్జామ్స్, బ్యాంకింగ్, ఇన్యూరెన్స్ చేపట్టే ఆఫీసర్ స్థాయి కొలువులకు సంబంధించిన కోచింగ్‌కు ఫీజు చెల్లిస్తారు.
ఎంట్రన్స్ ఎగ్జామ్స్: ఐఐటీ జేఈఈ, నీట్, క్యాట్, క్లాట్, సీడీఎస్, ఎన్డీఏ పరీక్షలకు, జీఆర్ఈ, శాట్, జీమ్యాట్, టోఫెల్ లాంటి పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ట్రైనింగ్ ఫీజు
చెల్లిస్తారు.
స్టైఫండ్: స్థానిక విద్యార్థులకు రూ.3000, ఔట్స్టేషన్ విద్యార్థులకు రూ.6000, దివ్యాంగులకు రూ.2000 స్పెషల్ ప్రోత్సాహకం అందజేస్తారు.
దరఖాస్తులు: ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
చివరితేది: 10 సెప్టెంబర్
వెబ్సైట్: www.coaching.dosje.gov.in
ఈ స్కీం రెండు పద్ధతుల్లో అమలు చేస్తారు. మొదటగా గుర్తింపు పొందిన కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌కు సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులు ఎంపిక ఇన్స్టిట్యూట్లే చేస్తాయి. రెండో దాంట్లో సంబంధిత మంత్రిత్వశాఖ విద్యార్థులను ఎంపిక చేసి, వారికి ఇష్టమైన కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకోవచ్చు. ఫీజును రెండు విడతల్లో స్టూడెంట్స్ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.